డాన్స్ కిచిడి ఐపోయిందన్న నటరాజ్ మాష్టర్..జనజన్మలకు నువ్వే భార్య కావాలన్న పవన్
on Jul 25, 2023
.webp)
"నీతోనే డాన్స్" ఈ శనివారం ఎపిసోడ్ రెట్రో థీమ్ తో మంచి కలర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. కాస్ట్యూమ్స్ కూడా అద్భుతమైనవి వేసుకొచ్చి ఆడియన్స్ ని మెస్మోరైజ్ చేశారు. ఇందులో ఒక్కొక్కళ్ళు ఎంచుకున్న సాంగ్స్ కూడా ఆడియన్స్ ని మళ్ళీ ఆ కాలానికి తీసుకెళ్లిపోయాయి. ఇక ఫస్ట్ పవన్ - అంజలి వచ్చి "ఎల్లువొచ్చి గోదారమ్మ" సాంగ్ కి డాన్స్ చేసి చూపించారు. ఈ సాంగ్ ఐపోయాక జడ్జెస్ వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. ఐతే ఈ సాంగ్ కి అంత ఆక్రోబాటిక్స్ అవసరం లేదని చెప్పారు తరుణ్ మాష్టర్..ఇక మిగతా జడ్జెస్ కి కూడా ఈ పెర్ఫార్మెన్స్ అంతగా నచ్చలేదని అర్ధమయ్యింది. వీళ్లకు నటరాజ్ మాష్టర్ జోడి 6 మార్క్స్ ఇచ్చారు.
అప్పట్లో ఎన్టీఆర్ లాంటి హీరోలంతా చాలా గ్రేస్ తో డాన్సస్ చేసేవాళ్ళు. కానీ మీరు వాళ్ళ డాన్స్ ని ఎంచుకుని చేయడంతో అది కిచిడి ఐపోయింది. సాంగ్ లో అన్ని లిఫ్టింగ్స్ అవసరం లేదని చెప్పారు. ఈ విషయం మీద అంజలి రివర్స్ కామెంట్స్ చేసింది. మీరు అన్నంత కిచిడిగా ఐతే లేదు, రెండు లిఫ్టింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది 6 మార్క్స్ ఇచ్చే పెర్ఫార్మెన్స్ కాదు అని చెప్పారు. ఇక షో స్టార్టింగ్ లో అబ్బాయిలతో లవ్ లెటర్స్ రాయించింది శ్రీముఖి. అలా పవన్ అంజలి కోసం రాసిన ప్రేమలేఖను చదివించింది. "నన్ను చూసుకోవడంలో ఒక తల్లిలా, నాకు ఎం కావాలో తెలుసుకుని ఇవ్వడంలో ఒక నాన్నలా, నన్ను ఓదార్చడంలో ఒక ఫ్రెండ్ లా, నా జీవితాన్ని సగం తీసుకుని నన్ను అర్థంచేసుకుని నన్ను పంచ ప్రాణంలా ప్రేమించే అర్దాంగిగా, నా జీవితానికి ఒక సంపూర్ణతను అందించిన అంజలి జన్మజన్మల నువ్వే నా భార్యగా ఉండాలి. ఐ లవ్ యు" అని రాసారు. ఇక వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ కి నిఖిల్ - కావ్య, శ్రీవాణి- విక్రమ్ 8 మార్క్స్ ఇచ్చారు. అలాగే వీళ్ళ డాన్స్ లో ఉన్న లోపాల్ని కూడా అందరూ చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



